ePaper
More
    HomeతెలంగాణTNGo's Nizamabad | ఉద్యోగుల హక్కుల సాధనకు జంగ్ సైరన్ మోగించాలి

    TNGo’s Nizamabad | ఉద్యోగుల హక్కుల సాధనకు జంగ్ సైరన్ మోగించాలి

    Published on

    అక్షరటుడే, భీమ్​గల్: TNGo’s Nizamabad | ఉద్యోగుల హక్కుల సాధనకు జంగ్ సైరన్(Jung Siren) మోగించాల్సిన సమయం వచ్చిందని ఎంప్లాయీస్​ జేఏసీ (Employees JAC) జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ (TNGOs Nizamabad) జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు.

    ఆర్మూర్ యూనిట్ కార్యాలయంలో ఎస్ఆర్ఎస్పీ(SRSP), భీమ్​గల్ (Bheemgal)​ యూనిట్ల అధ్యక్షులు సృజన్ కుమార్, ప్రవీణ్ రాజ్ అధ్యక్షతన నిర్వహించిన ఉమ్మడి యూనిట్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

    ఈ సందర్భంగా పలు ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా భావించాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయాల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలపాలని స్పష్టం చేశారు.

    అలాగే సీపీఎస్ అంతం కోసం ఏర్పాటుచేసిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 11వ తేదీన జిల్లాకేంద్రానికి విచ్చేస్తున్న జేఏసీ రాష్ట్ర నాయకులను ఆహ్వానించాలని, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం బహిరంగ సభకు పెద్దఎత్తున ఉద్యోగులు హాజరుకావాలని ఆయన కోరారు.

    ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, నిజామాబాద్​ అర్బన్ యూనిట్ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, ఆర్మూర్ యూనియన్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, ఎస్సారెస్పీ యూనిట్ కార్యదర్శి సాయికృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, ఇరు యూనిట్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

    More like this

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...