అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Raja Saab Teaser | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Young Rebel Star Prabhas) నుండి చాలా రోజుల తర్వాత వస్తున్న చిత్రం రాజాసాబ్. ఇప్పుడు దేశమంతా ‘ది రాజా సాబ్’ టీజర్ రిలీజ్ మేనియా నెలకొంది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండడం మినిమమ్ కదా! తాజాగా రాజా సాబ్ టీజర్(Raja Saab Teaser) విడుదల కాగా.. ‘ది రాజా సాబ్’తో వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. రాజాసాబ్ టీజర్ చూస్తే గూస్ బంప్స్ అని అంటున్నారు. ఇండియా అంతా ‘రాజా సాబ్’ మ్యాడ్‌నెస్ చూస్తుంది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ‘ది రాజా సాబ్’ సినిమా అభిమానులు అందరూ సెలబ్రేట్ చేసుకునేలా ఉంది.
Raja Saab Teaser | టీజర్ అదిరింది..
సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలతో ప్రభాస్‌కి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చాయి. అయితే ఆ రెండు యాక్షన్ ఫిలిమ్స్. ఇప్పుడు వింటేజ్ ప్రభాస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దర్శకుడు మారుతి(Director Maruthi) చాలా బలంగా చెబుతున్నారు. ‘ది రాజా సాబ్’ నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్ చూస్తే అభిమానుల్లో కూడా నమ్మకం బలపడింది. ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్‌ను రూపొందించారు. భారతీయ సినిమా చరిత్రలో మరే హారర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు.
హారర్ కామెడీ జానర్లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్”ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్(Producer TG Vishwaprasad). ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో నటిస్తున్నారు. తాజాగా విడుదల కాబోతున్న ఈ టీజర్ పలు రికార్డులను బ్రేక్ చేస్తుందని అంటున్నారు.
