Homeక్రీడలుICC Hall of Fame | ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకున్న ధోనీ.....

ICC Hall of Fame | ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకున్న ధోనీ.. ఇంకా ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ICC Hall of Fame | భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ సాధించ‌ని రికార్డులు లేవు. ఆయ‌న భార‌త క్రికెట్‌కు అన్ని ఐసీసీ క‌ప్స్ అందించి పెట్టాడు. ఈ ఖ్యాతి మరే ఆట‌గాడికి ద‌క్క‌లేదు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి (MS Dhoni) అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా మూడు వరల్డ్‌కప్‌లు అందించిన మిస్టర్ కూల్‌కు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో (ICC Hall of Fame) చోటు దక్కింది. ఏడుగురు ఆటగాళ్లతో కొత్తగా ప్రకటించిన ఈ జాబితాలో ధోనీకి అవకాశం కల్పించారు. లండన్ వేదికగా సోమవారం ప్రకటించిన ఈ జాబితాలో ఎంఎస్ ధోనీతో పాటు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్, సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్స్ గ్రేమ్ స్మిత్ (Grame Smith), హషీమ్ ఆమ్లా (Hashim amla), న్యూజిలాండ్ ప్లేయర్ డానియల్ వెటోరి (Denial vitory), ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ (Sara Tylor), పాకిస్తాన్‌కు చెందిన సనాకు (Sana) ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.

ICC Hall of Fame | గ్రేట్ అచీవ్‌మెంట్..

ఎలాంటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉండడం, అసమానమైన వ్యూహాత్మక నైపుణ్యం ఎంఎస్ ధోనీ (MS Dhoni) సొంతం. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆయనో మార్గదర్శకుడు. ఆట ముగించడంలో మేటిగా, గొప్ప నాయకుడిగా, అద్భుతమైన వికెట్ కీపర్‌గా (wicket keeper) ధోనీ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం కల్పించాం” అని ఐసీసీ (ICC) ఓ ప్రకటనలో తెలియ‌జేసింది. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 17,266 పరుగులు సాధించాడు. వికెట్ల వెనుక 829 మందిని పెవిలియన్‌కు పంపాడు. ఈ గణాంకాలు ఆయన ప్రతిభనే కాకుండా, అసాధారణ నిలకడ, ఫిట్‌నెస్, సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడిన తీరును ప్రతిబింబిస్తాయని ఐసీసీ కొనియాడింది.

క్రికెట్‌(Cricket) ఎదుగుదలకు నడిపించిన క్రికెటర్లను స్మరించుకోవడానికి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు హాల్ ఆఫ్ ఫేమ్‌ను వేదికగా చేస్తున్నామని తెలిపారు ఐసీసీ (Icc) చైర్మన్ జైషా. ఏడుగురు కొత్త సభ్యులను ఆహ్వానిస్తున్నామని, వారికి ఐసీసీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈసారి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో(ICC Hall Of Fame) చోటు దక్కించుకోవడం ద్వారా ధోనీకి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ క్రికెట్‌ను ప్రభావితం చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈసారి ఈ గౌరవం లభించగా, అందులో ధోనీ కూడా ఒకడిగా నిలవ‌డం ఆయన అభిమానుల‌కు గ‌ర్వ‌కార‌ణం. ధోనీ కెప్టెన్సీలో 2007లో మొదటిసారి టీ20 కప్ అందుకుంది భార‌త్. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచ కప్‌ను (ODI World Cup) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్ చేతుల్లోకి తీసుకొచ్చాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) కూడా భారత్ గెలవడంలో ధోని నాయకత్వం కీలకంగా నిలిచింది.