అక్షరటుడే, బోధన్: Lions Club | లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) కొనియాడారు. లయన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25ఏళ్లుగా ప్రజలకు సేవ చేయడాన్ని ఆయన అభినందించారు.
Lions Club | బోధన్ పట్టణంలో..
బోధన్ పట్టణంలోని శుక్రవారం రాకాసీపేట్లో లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ (Lions Charitable Trust) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన లయన్స్ జనరల్ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో (Collector Ila Tripathi) కలిసి ప్రభుత్వ సలహాదారు పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోగులకు సరైన వైద్య పరీక్షలు నిర్వహించి హెవీ డోస్ మందులు కాకుండా వ్యాధి తీవ్రత ఆధారంగా సరసమైన ధరల్లో మందులు అందించాలని సూచించారు. లయన్స్ ఆస్పత్రికి తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు, సభ్యులను అభినందించారు. కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మరిన్ని సేవలు అందించి జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.