Homeజిల్లాలునిజామాబాద్​TNGO's Nizamabad | రాష్ట్ర టీఎన్జీవోస్ సేవలు అభినందనీయం ​

TNGO’s Nizamabad | రాష్ట్ర టీఎన్జీవోస్ సేవలు అభినందనీయం ​

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: TNGO’s Nizamabad | ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న టీఎన్జీవోస్​ రాష్ట్రశాఖ సేవలు అభినందనీయమని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ అన్నారు. హైదరాబాద్​లో (Hyderabad) గురువారం రాష్ట్ర టీఎన్జీవోస్​ కార్యవర్గ సమావేశం జరుగగా.. నిజామాబాద్​ జిల్లా శాఖ సభ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుమన్ ​కుమార్​ మాట్లాడుతూ.. పెండింగ్​లో ఉన్న ఉద్యోగుల సమస్యలపై సీఎం (CM Revanth Reddy), మంత్రివర్గంతో సమన్వయపర్చుకుని పరిష్కరిస్తున్న రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్​, ఎస్​ఎం హుస్సేనీలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

TNGO’s Nizamabad | వసంతోత్సవం..

టీఎన్జీవోస్​ ఏర్పాటు చేసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలోనే వసంతోత్సవాలు నిర్వహించనున్నందున జిల్లానుంచి ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొనేవిధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ పాల్గొన్నారు.