అక్షరటుడే, డిచ్పల్లి: Pipula Rajareddy | పేద ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి పైపుల రాజారెడ్డి అని.. ఆయన సేవలు మరువలేనివని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi reddy) పేర్కొన్నారు.
జక్రాన్పల్లి (Jakranpally) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ స్కూల్ (Zilla Parishad School) వద్ద దివంగత పారిశ్రామికవేత్త, సమాజసేవకుడు పైపుల రాజారెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను సంపాదించిన దాంట్లో సమాజసేవకే ఎక్కువభాగం వెచ్చించిన వ్యక్తి పైపుల రాజిరెడ్డి అని అన్నారు. ఆయన సేవలను భావితరాలకు సైతం గుర్తుండాలనే ఉద్దేశంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.