Mahatma Charitable Organization
Mahatma Charitable Organization | ‘మహాత్మ స్వచ్ఛంద సేవాసంస్థ’ సేవలు అభినందనీయం

అక్షర టుడే, ఆర్మూర్: Mahatma Charitable Organization | ఆర్మూర్ ‘మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ’ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్మూర్ మున్సిపల్ (ARMOOR Muncipality) మాజీ వైస్ ఛైర్మన్ మోత్కూరి లింగాగౌడ్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీ (Housing Board Colony) హనుమాన్ ఆలయ ఆవరణలో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం చుట్టూ ఉన్న చెత్తా చెదారాన్ని, ఆలయ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థపాక అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు వేముల ప్రకాష్, కాలనీవాసులు ఆత్మచరణ్, శ్రీ రామోజీ దశరథ్, ఆనంద్, పురుషోత్తం, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకె నిశాంత్, గుర్రం రాకేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.