అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ గంజాయిని పోలీసులు దహనం చేయించారు. జక్రాన్పల్లి (Jakranpally) మండలం పడకల్లో ఉన్న మెడికేర్ సర్వీసెస్ (Medicare Services) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బయో మెడికల్ వేస్టేజ్ ప్లాంట్లో సోమవారం గంజాయిని దహనం చేశారు.
CP Sai Chaitanya | సీపీ సాయిచైతన్య పర్యవేక్షణలో..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 పోలీస్స్టషన్ల పరిధిలో దాదాపు 410 కేజీల ఎండు గంజాయిని గతంలో సీజ్ చేయగా.. సోమవారం సీపీ సాయిచైతన్య సమక్షంలో దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. గంజాయి (Marijuana) రవానాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గంజాయిని సమూలంగా అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి (ACP Raja Venkat Reddy), సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, బయో మెడికల్ వేస్టేజ్ సర్వీసెస్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.