HomeతెలంగాణWeather | రానున్న నాలుగు రోజులు దంచికొట్టనున్న ఎండలు

Weather | రానున్న నాలుగు రోజులు దంచికొట్టనున్న ఎండలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Weather | తెలంగాణలో గత కొద్దిరోజులు ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతున్నాయి. రానున్న నాలురోజుల పాటు ఎండలు మరింత ముదరనున్నాయని వాతావరణ శాఖ(Meteorological Department) పేర్కొంది. ఇందులో భాగంగా 16 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్(Orange Alert)​ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow Alert) ఇచ్చింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, సహా 16 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆరెంజ్ అలర్ట్​ జారీ చేసిన జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.