అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Mandal | కొత్త సర్పంచ్‌లు తండాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎల్లారెడ్డి మున్సిపల్ (Yellareddy Municipality) మాజీ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు. మండలంలోని తిమ్మారెడ్డి తండాలో (Timmareddy Thanda) నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం అభినందన సభ నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Yellareddy Mandal | ప్రజల సమస్యలు పరిష్కరించాలి..
ఈ సందర్భంగా కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ.. తండాల్లో సమస్యలు పరిష్కరించే విధంగా పాలకవర్గాలు కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో సర్పంచ్‌లుగా గెలిపించుకున్నారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సూచించారు. తండాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన పాలవర్గ సభ్యులను మున్సిపల్ మాజీ ఛైర్మన్ సత్కరించారు. కార్యక్రమంలో హాజీపూర్ సర్పంచ్ రతన్, సోమ ర్యాగడి తండా సర్పంచ్ ప్రియాంక గణేష్ తదితరులు పాల్గొన్నారు.