73
అక్షరటుడే, భీమ్గల్ : Sarpanch Elections | పడగల్ గ్రామ (Padagal Village) సర్పంచ్ నల్ల రాజు, ఉపసర్పంచ్ నరేందర్లను భీమ్గల్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం (Market Committee Office)లో నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో వారు చూపిస్తున్న చొరవను ఈ సందర్భంగా ముత్యం రెడ్డి (Muthyam Reddy) అభినందించారు. ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గడ్డం నర్సారెడ్డితో పాటు డైరెక్టర్లు గంగాధర్, రవి, రాజేష్, మహిపాల్, సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.