Homeజిల్లాలునిజామాబాద్​Yedapally | ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరగని క్రయవిక్రయాలు.. ఆందోళనకు దిగిన రైతులు

Yedapally | ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరగని క్రయవిక్రయాలు.. ఆందోళనకు దిగిన రైతులు

కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయాలు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Yedapally | ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో (Paddy Center) ధాన్యం విక్రయాలు జరగకపోవడంతో కడుపుమండిన రైతులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఎడపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.

అయితే నిత్యం క్రయవిక్రయాలు నిర్వహించడం లేదని పేర్కొంటూ రైతులు బుధవారం మండల కేంద్రంలో రహదారిపై రాస్తారోకో చేశారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని డిమాండ్​ చేశారు. రైతుల నిరసనతో భారీగా ట్రాఫిక్​ జాం (Traffic jam) అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు (Yedapally Police) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారికి నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.