Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Police | పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి

Kamareddy Police | పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డిలో క్యాండిల్​ ర్యాలీ నిర్వహించారు. అడిషనల్​ ఎస్పీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అమరుల సేవలు మరువ లేనివన్నారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police | పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి (Additional SP Narasimha Reddy) అన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులు ఎల్లప్పుడూ ప్రేరణ అని, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సంతోష్, నవీన్ కుమార్, కృష్ణ, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.