అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Martyrs Week | పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద సైకిల్ ర్యాలీని ప్రారంభించి అందులో పాల్గొన్నారు. పులాంగ్ చౌరస్తా నుంచి ప్రారంభమైన సైకిల్, బైక్ ర్యాలీ ప్రధాన వీధుల గుండా నెహ్రూ పార్క్ (Nehru Park) చౌరస్తా వరకు నిర్వహించారు.
Police Martyrs Week | వారి త్యాగాలు స్మరించుకునేందుకే సైకిల్ ర్యాలీ
పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకునేందుకే సైకిల్ ర్యాలీ (Bicycle Rally) నిర్వహిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అమరుల త్యాగాలను గుర్తుచేస్తూ వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వడమే మా ఉద్దేశమన్నారు. పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు.
తాము నివసించే చుట్టుపక్కల కాలనీల్లో, గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా.. అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా, సైబర్ క్రైమ్‌లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉందని ఆయన అన్నారు.. వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కమిషనరేట్ (Police Commissionerate) పరిధిలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సురేష్, నగరంలోని పోలీస్స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు ఇతర పోలీసు అధికారులు 12 ఎన్సీసీ కేడెట్లు, స్కూల్ విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
