అక్షరటుడే, వెబ్డెస్క్ :Tirumala | కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో శనివారం భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనానికి తరలి వచ్చారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం స్వామివారిని 72,174 మంది భక్తులు(Devotees) దర్శించుకుకున్నారు. 35,192 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్క రోజే స్వామి వారికి రూ.2.88 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు(TTD officers) ఏర్పాట్లు చేస్తున్నారు.