అక్షరటుడే, వెబ్డెస్క్:Tirumala | తిరుమల వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) దర్శనానికి భక్తులు(Devotees) పొటెత్తారు. వీకెండ్ కావడంతో శనివారం తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. మరి కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు వాతావరణం కూడా చల్లబడటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntham Queue Complex) లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం స్వామివారిని 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రూ.3.42 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
