అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rupee Value | కొన్ని రోజులుగా పడిపోతున్న రూపాయి విలువ క్రమంగా పెరుగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ శనివారం 97 పైసలు పెరిగింది.
ఇటీవల భారత రూపాయి నిరంతర ఒత్తిడికి గురవుతూ అమెరికా డాలర్‌తో (US dollar) పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి మరింత పతనమయ్యే అవకాశం ఉందా అనే దానిపై ఇది కొత్త ఆందోళనలను రేకెత్తించింది. అయితే తాజాగా రూపాయి కొంత బలపడడం ఊరటనిస్తోంది.
Rupee Value | పెరిగే అవకాశం
అంతర్జాతీయ మార్కెట్లో (International Market) రూపాయి బలపడుతోంది. డాలర్‌తో పోలిస్తే 89.27కు చేరిన రూపాయి మారకం విలువ. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ఖరారు కాకపోవడం, ట్రంప్ టారిఫ్‌లు, విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ (Stock Market) నుంచి వైదొలగడం వంటి కారణాలతో రూపాయి ఒత్తిడికి గురైంది. దీంతో రికార్డు స్థాయిలో డాలర్ మారకం విలువ 91కి చేరింది. దీంతో భారత్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా రూపాయి బలం పుంజుకుంటోంది. 2025లో రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే సుమారు 5.3 శాతం క్షీణించింది. అయితే రానున్న రోజుల్లో రూపాయి విలువ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ (India) కరెంట్ ఖాతా లోటు GDPలో 0.6 శాతంగా అంచనా వేయబడింది. డిసెంబర్ 5 నాటికి విదేశీ మారక నిల్వలు 687 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రూపాయి ఇప్పటికే వాస్తవ ప్రాతిపదికన అర్థవంతంగా సరిదిద్దబడింది. రూపాయిలో క్షీణత ఇప్పటికే కొంత సర్దుబాటు పనిని పూర్తి చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు.