Homeబిజినెస్​Indian Rupee | బలపడుతున్న రూపాయి.. ఏడు నెలల గరిష్టానికి..

Indian Rupee | బలపడుతున్న రూపాయి.. ఏడు నెలల గరిష్టానికి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Indian Rupee | అంతర్జాతీయ పరిణామాలతో గత ఆర్థిక సంవత్సరంలో రూపాయి(Rupee) విలువ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రధానంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు భారీగా పతనమైంది. గతేడాది అక్టోబర్‌ 15న డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07 వద్ద ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నాటికి 88 కి పడిపోయి జీవనకాల కనిష్టాన్ని నమోదు చేసింది.

Indian Rupee | బలహీనపడడానికి కారణాలు..

యూఎస్‌(US)లో ఆర్థికమాంద్యం పరిస్థితులు, భారత్‌లో ఆర్థిక వృద్ధి తక్కువగా నమోదు కావచ్చన్న అంచనాలకు తోడు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించడంతో డాలర్‌(Dollar) బలపడడంతో రూపాయి విలువ బలహీనపడుతూ వచ్చింది. యూఎస్‌ అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎంపికయ్యాక పరిస్థితి మరింత దిగజారింది. ట్రంప్‌ నిర్ణయాలతో అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. యూఎస్‌పై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై రెసిప్రోకల్‌ టారిఫ్స్‌(Reciprocal tariffs) విధిస్తామని తరచూ ప్రకటించడంతో ఎఫ్‌ఐఐ(FII)లు దేశీయ స్టాక్‌ మార్కెట్లలోనుంచి పెట్టుబడులు ఉపసంహరణల వేగం పెంచారు. దీంతో రూపాయి విలువ మరింత బలహీనపడుతూ వచ్చి ఫిబ్రవరిలో జీవనకాల కనిష్టాలకు చేరింది.

Indian Rupee | ఆర్‌బీఐ చర్యలతో కోలుకుని..

ఫిబ్రవరిలో ఆర్‌బీఐ(RBI) జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని అడ్డుకుంది. దీంతో రూపాయి కోలుకోవడం ప్రారంభించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం, మార్కెట్‌లో లిక్విడిటీని పెంచడానికి చర్యలు తీసుకోవడం, క్రూడ్‌ ఆయిల్‌(Crude oil) ధర తగ్గుతూ రావడం, డాలర్‌ ఇండెక్స్‌ పడిపోవడం వంటి కారణాలతో ఎఫ్‌ఐఐలు తిరిగి భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. భారత ఆర్థిక వృద్ధి అంచనాలకు అనుగుణంగా ఉండడం, దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic stock markets)లో బుల్‌ ర్యాలీ మొదలవడం కూడా ఎఫ్‌ఐఐలు తిరిగి రావడానికి కారణమయ్యాయి. ఎఫ్‌ఐఐలు వరుసగా 12 సెషన్లుగా నెట్‌ బయ్యర్లుగా నిలుస్తుండడంతో రూపాయి విలువ ఆరు నెలల గరిష్టానికి చేరింది. ఇదే సమయంలో ట్రంప్‌(Trump) నిర్ణయాలతో డాలర్‌ విలువ క్షీణించడం కూడా రూపాయికి కలిసొచ్చింది. శుక్రవారం ఇంట్రాడేలో 83.75 స్థాయికి చేరింది. ఇది ఏడు నెలల గరిష్టం. అనంతరం భారత్‌(Bharath), పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోయి ట్రేడింగ్‌(Trading) ముగిసే సమయానికి 84.53 వద్ద స్థిరపడింది.

Must Read
Related News