అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market)కు మన కరెన్సీ దన్నుగా నిలుస్తోంది. వరుసగా మూడు సెషన్లలో రూపాయి బలపడడం, ఎఫ్ఐఐ(FII)లు నెట్ బయ్యర్లుగా నిలుస్తుండడం, గ్లోబల్ మార్కెట్లలో సానుకూలతలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడుతోంది. దీంతో సూచీల్లో జోష్ కనిపిస్తోంది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 216 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 316 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ (Nifty) 89 పాయింట్ల లాభంతో స్వల్పంగా 8 పాయింట్లు తగ్గినా.. పుంజుకుని మరో 95 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 85,376 వద్ద, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 6,124 వద్ద ఉన్నాయి.
మెటల్, ఐటీలలో కొనసాగుతున్న జోరు..
దేశీయ స్టాక్ మార్కెట్లో మెటల్, ఐటీ రంగాలలో జోరు కొనసాగుతోంది. బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 1.75 శాతం పెరగ్గా.. ఐటీ 1.29 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.28 శాతం, కమోడిటీ 1.18 శాతం, ఇండస్ట్రియల్ 1.16 శాతం, ఇన్ఫ్రా 0.95 శాతం, టెలికాం 0.89 శాతం, సర్వీసెస్ 0.84 శాతం లాభాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.98 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.62 శాతం లాభంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ఉండగా.. 6 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. ఇన్ఫోసిస్ 2.17 శాతం, ట్రెంట్ 2.05 శాతం, ఎయిర్టెల్ 1.99 శాతం, టెక్ మహీంద్రా 1.68 శాతం, టీఎంపీవీ 1.67 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎస్బీఐ 0.63 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.34 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.23 శాతం, పవర్‌గ్రిడ్ 0.15 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 0.11 శాతం నష్టాలతో ఉన్నాయి.