అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medaram Jathara | మేడారం (Medaram) మహా జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు సాగనుంది. భారీగా తరలిరానున్న భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తయ్యాయి.
మేడారం జాతరకు దాదాపుగా 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ (RTC) అధికారులు అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు స్పెషల్ బస్సులు (Special Buses) నడవనున్నాయి. మేడారం జాతర కోసం మొత్తం 4 వేల ఆర్టీసీ బస్సులు మోహరించనున్నారు. మేడారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 50 క్యూ-లైన్లు (9 కి.మీ.), ఒకేసారి 20 వేల మంది ప్రయాణికులకు వసతి కల్పించే విధంగా సౌకర్యాలు కల్పించారు.
Medaram Jathara | పార్కింగ్ కోసం..
మేడారం ఆర్టీసీ బస్సుల పార్కింగ్ కోసం 25.76 ఎకరాలలు కేటాయించారు. ఇందులో ఒకేసారి 1,000 బస్సులు నిలుపవచ్చు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, భద్రతా సిబ్బంది, అధికారులతో సహా 10,441 మంది సిబ్బంది జాతర విధుల్లో పాల్గొననున్నారు. సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ కోసం 76 సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్, పెట్రోలింగ్ జీపులు, మోటార్ సైకిళ్లు ఏర్పాటు చేయనున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం (Mahalaxmi Scheme) నేపథ్యంలో దాదాపు 20 లక్షల మంది మహిళా భక్తులు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. తాత్కాలిక బస్ స్టేషన్లో తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు.
Medaram Jathara | తాగునీటికి..
భక్తులకు సురక్షితమైన తాగునీటిని అందించడానికి ప్రభుత్వం మేడారంలో ఏర్పాట్లు చేసింది. 5,500 తాత్కాలిక నీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇందులో 517 బ్యాటరీ కుళాయిలు, 47 సిస్టర్న్లు, 312 సిస్టర్న్ కుళాయిలు, 10 చలివేంద్రాలు ఉన్నాయి. జాతర పరిసరాల్లో శుభ్రతకు పెద్దపీట వేశారు. 285 టాయిలెట్ బ్లాకులలో 5,700 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 5 వేల మంది పారిశుధ్య కార్మికులు 3 షిఫ్టులలో పని చేయనున్నారు.