అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భారతజాతి ఐక్యతలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) పాత్ర కీలకమని ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త ప్రవీణ్ తాడూరి పేర్కొన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త కె.అపర్ణ ఆధ్వర్యంలో పేటల్ జయంతిని నిర్వహించారు. ‘జాతి ఐక్యతలో ఉక్కుమనిషి పాత్ర’ అనే అంశంపై జిల్లాలోని వివిధ డిగ్రీ, పీజీ కళాశాలల (degree and PG colleges) విద్యార్థులకు ఆగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ తాడూరి మాట్లాడుతూ.. ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశాన్ని నిర్మించిన మహా నాయకుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖుడని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే అత్యంత సంక్లిష్ట సమయంలో సంస్థానాలన్నింటినీ మన జాతీయ జెండా కిందికి పటేల్ చేర్చారన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతతోనే దేశ ఐక్యత, సార్వభౌమత్వం సాధ్యమైందని కొనియాడారు. యువత సర్దార్ పటేల్ జీవితాన్ని ఆదర్శనంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు స్రవంతి, స్వప్న, అలీం ఖాన్, సంపత్, సరిత, జూనియర్ అసిస్టెంట్ సురేష్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
