అక్షరటుడే, ఇందూరు: RTC Nizamabad | ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని రీజినల్ మేనేజర్ జ్యోత్స్న (Regional Manager Jyotsna) అన్నారు. నిజామాబాద్-1 డిపోలో (RTC Depot) శుక్రవారం ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. క్రమశిక్షణ, సేవాభావం, సురక్షిత ప్రయాణం.. ఇవే సంస్థ బలాలు అని పేర్కొన్నారు. అవార్డులు కృషికి గుర్తింపు మాత్రమే కాదని.. ఇతరులకు ప్రేరణ అని తెలిపారు. అనంతరం ఆయిల్ సేవింగ్, ఆదాయ వృద్ధి, తదితర అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు, కండక్టర్లు, టైం డ్రైవర్లు, పీహెచ్బీ డ్రైవర్లు (PHB Drivers), టెక్నీషియన్లు, శ్రామికులకు సర్టిఫికెట్లు.. నగదు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, పీవో పద్మజ, అన్ని డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
