అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం (Heavy Rains) బాల్కొండ నియోజకవర్గాన్ని (Balkonda constituency) అతలాకుతలం చేసింది.
వేల్పూర్(Velpoor), కమ్మర్పల్లి (Kammarpally), భీమ్గల్ మండలాల్లోని పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరద నీరు పోటెత్తడంతో పంటలు పూర్తిగా నీటి మునిగాయి.
పలుచోట్ల వరి చేనల్లో ఇసుకమేటలు వేసింది. వందల ఎకరాల్లో వరి నేలకొరగడంతో రైతులకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. భీమ్గల్లోని కప్పలవాగు వంతెన పైనుంచి నీరు పారడంతో వంతెన ఓ పక్కకు వంగిపోయింది. భీమ్గల్ నుంచి బడా భీమ్గల్కు వెళ్లే రోడ్డుపై వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది.
దీంతో భీమ్గల్, బడా భీమ్గల్ (Bada Bheemgal) గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కప్పలవాగు బ్రిడ్జిపై నుంచి నీరు పొంగిపొర్లడంతో చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల మేర వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. పొట్ట దశలో ఉన్న వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని నష్టపోయిన రైతులు కోరారు.
వరద ఉధృతి కారణంగా పొలాల్లో వేసిన ఇసుక మేట
కోతకు గురైన రోడ్డు