అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు మారడం లేదు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే వారిని లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా ఓ ఆర్ఐ ఏసీబీ అధికారులకు (ACB officials) చిక్కారు.
ఖమ్మం జిల్లా (Khammam district) కారేపల్లి మండలంలో దౌలూరి శుభ కామేశ్వరి దేవీ ఆర్ఐ పని చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (family member certificate) కోసం ఆమె ఓ వ్యక్తిని రూ.10 వేల లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో, ఆమె ఇంట్లో తనిఖీలు చేశారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.