అక్షరటుడే నిజాంసాగర్:Inter Results | జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల(Government Intermediate Colleges)ల్లో ఈ ఏడాది ఫలితాలు అంతంతమాత్రంగానే వచ్చాయి. కళాశాలల్లో ఉపాధ్యాయుల కొరత(Teacher shortage), వసతుల లేమి కారణంగా ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదు. అధ్యాపకుల పనితీరు కూడా ప్రభావం చూపిందని పలువురు పేర్కొంటున్నారు.
Inter Results | 19 ఇంటర్ కళాశాలలు..
జిల్లాలో 19 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ ఫస్టియర్లో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College)లో మొత్తం 1,677 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 452 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించి 27శాతం ఫలితాలను నమోదు చేశారు. ఇక సెకండియర్కు వస్తే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2015 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 747 మంది ఉత్తీర్ణత సాధించారు. 33.08శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Inter Results | ఒక్కరూ మాత్రమే పాస్…
నిజాంసాగర్ మండల కేంద్రంలో ఈ విద్యా సంవత్సరం అన్ని హంగులతో కొత్తగా జూనియర్ కళాశాల(Junior College)ను ఏర్పాటు చేశారు. ఇదే కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. కళాశాలలో 21 మంది విద్యార్థులు(Students) ఉండగా వారిలో 13 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షా ఫీజు కట్టి ఎగ్జామ్స్కు హాజరయ్యారు. కానీ వారిలో కేవలం ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
Inter Results | నాగిరెడ్డిపేట కళాశాలలో..
నాగిరెడ్డిపేట కళాశాలలో 45 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. ఎల్లారెడ్డి జూనియర్ కళాశాల(Yella Reddy Junior College)లో 104 మంది విద్యార్థులకు ఐదుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. తాడ్వాయిలో 60 మంది విద్యార్థులకు గాను ఏడుగురు, గాంధారిలో 53 మంది విద్యార్థులకు గాను 9 మంది, మాచారెడ్డిలో 61 మంది విద్యార్థులకు గాను ఎనిమిది మంది, సదాశివ నగర్ లో 69 మంది విద్యార్థులకు గాను ముగ్గురు పాసయ్యారు. ఇలా దాదాపుగా అన్ని కళాశాలల్లోనూ ఒక్క డిజిట్ దాటి పాస్ కాలేదంటే కళాశాలల్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుసుకోవచ్చు.