HomeజాతీయంArthritis | ఆర్థరైటిస్ రావడానికి అసలు కారణమదే.. గంటల తరబడి కదలకుండా కూర్చోవడమే అసలు సమస్య

Arthritis | ఆర్థరైటిస్ రావడానికి అసలు కారణమదే.. గంటల తరబడి కదలకుండా కూర్చోవడమే అసలు సమస్య

Arthritis | ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. యువకులు సైతం కీళ్లు, మోకాలి నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక జీవన శైలితో ఇలాంటి పరిస్థితి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arthritis | ఆర్థరైటిస్.. ఎముకల అరుగుదల(Osteoporosis) గతంలో వృద్ధుల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యవ్వనంలో ఉన్న చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. 20 – 30 ఏళ్ల వయస్సు ఉన్న వారు సైతం కీళ్లు, మోకాలి నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు.

అయితే, ఇది ప్రమాదకరంగానో, లేదా జెనెటిక్ సమస్యల(Genetic Problems) వల్లనో వస్తున్న రుగ్మత కాదు. ఆధునిక జీవన శైలి కారణంగా వస్తున్న సమస్య అని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లు, మనం కూర్చునే విధానం, కదిలే విధానం, తినే తిండి, పని చేసే విధానం వల్ల ఆర్థరైటిస్ సమస్య విస్తృతమవుతోందని వివరిస్తున్నారు. జీవనశైలిని మార్చుకోక పోతే వృద్ధాప్యానికంటే ముందే కీళ్లు, మోకాలి నొప్పులతో సతమతం కావడమని చెబుతున్నారు. చిన్న చిన్న పనులతో ఆర్థరైటిస్ రాకుండా ఎలా కాపాడుకోవచ్చో వివరిస్తున్నారు.

Arthritis | గంటల తరబడి కూర్చోవద్దు..

వాస్తవానికి మన శరీరంలోని ఎముకలు కదలడాని కోసమే రూపొందించబడ్డాయి. కానీ కానీ ఆధునిక జీవితం మనలో చాలా మందిని కుర్చీలకు అతుక్కుపోయేలా చేసింది. ఇష్టమొచ్చిన రీతిలో గంటల తరబడి కూర్చోవడం వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు సడలుతాయి. క్రమంగా, ఇది మోకాలు, తుంటి, వీపులో దృఢత్వం, వాపు, అకాల క్షీణతకు కారణమవుతుంది. దీన్ని నివారించాలంటే కనీసం అరగంటకు ఒకసారైనా లేచి నాలుగు అడుగులు వేయాలి.

Arthritis | ఒకేలా కూర్చోవద్దు..

ఫోన్ లేదా ల్యాప్టాప్పై నిరంతరం వంగడం వల్ల మెడ, భుజాలు, నడుముపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఆర్థరైటిస్ ప్రారంభమవుతంది. దీన్ని నివారించడానికి మీ స్క్రీన్ లేదా డెస్క్ టాప్ ను కంటి కి ఎదురుగా ఉండేలా చూసుకోవడం, నిటారుగా కూర్చోవడం వంటివి చేయాలి తద్వారా కీళ్లపై దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించవచ్చు. అలాగే ఒకే భంగిమలో కూర్చోకూడదు. కనీసం అరగంటకోసారైనా వేర్వేరు పద్ధతుల్లో కూర్చోవాలి.

Arthritis | ఆహార నియమాలు తప్పనిసరి..

ఫాస్ట్ ఫుడ్(Fast Food), శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెర స్నాక్స్ కీళ్ల వాపుకు నిశ్శబ్దంగా దోహదపడతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు కాళ్లలో మంట పుట్టిస్తాయి. ఇది మృదులాస్థిని వేగంగా దెబ్బతీస్తుంది. అధిక బరువు ఉండటం వల్ల మోకాలు, చీలమండలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

Arthritis | అతి వ్యాయామం సరికాదు..

కీళ్ల ఆరోగ్యానికి(Joint Health) వ్యాయామం చాలా కీలకం, కానీ చాలా మంది హడావుడిగా ఇష్టమొచ్చిన రీతిలో ఎక్కువ సేపు వ్యాయామం చేస్తారు. గంటల తరబడి వ్యాయామం ఏమాత్రం మంచిది కాదు. సరైన విధానంలో, నిర్దేశిత సమయం మాత్రమే వ్యాయామం చేస్తే సరైన ఫలితాలు ఉంటాయి. ఆర్థరైటిస్ అనివార్యంగా అనిపించవచ్చు, నివారించడం సులువే. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు, సర్దుబాట్లు, క్రమం తప్పకుండా శారీరక శ్రమ, స్పృహతో తినడం, సరైన భంగిమలో కూర్చోవడం వంటి వాటితో కీళ్లను యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పాటునందిస్తాయి.