అక్షరటుడే, వెబ్‌డెస్క్: Religious Population | ప్రపంచ జనాభా రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇందులో మతాల వారీగా చూస్తే ముస్లిం(Muslims)ల జనాభా వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఇస్లాం మతం వేగంగా విస్తరిస్తోందని ఓ నివేదిక వెల్లడించింది. పదేళ్లలో ముస్లింల జనాభా 347 మిలియన్లు పెరగడం గమనార్హం. ఇందులో హిందూ మతం నాలుగో స్థానంలో ఉంది. 2010 నుంచి 2020 వరకు ప్రపంచంలోని మతాల జనాభా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.
Religious Population | 200 కోట్లకు చేరిన ముస్లింల జనాభా
ప్రపంచంలో ముస్లింల జనాభా 200 కోట్లకు చేరింది. 2010 నుంచి 2020 వరకు 347 మిలియన్లు పెరిగి 2 వందల కోట్లకు చేరింది. అధిక జనన రేటు దీనికి ప్రధాన కారణంగా నివేది తెలిపింది. 2060 నాటికి ఇస్లాం క్రైస్తవ(Christian) మతాన్ని అధిగమించే అవకాశం ఉందని అభిప్రాయ పడింది.
Religious Population | హిందువులు 14.9 శాతం
ప్రపంచ జనాభాలో హిందువులు 14.9 శాతం ఉన్నారు. హిందూ జనాభా(Hindu population) దాదాపు ప్రపంచ జనాభా వృద్ధి రేటుతోనే పెరిగింది. 2010 నుంచి 2020 వరకు 126 మిలియన్లు పెరిగి, 120 కోట్లకు చేరింది.
Religious Population | తగ్గుతున్న క్రైస్తవులు
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న మతంలో క్రైస్తవం టాప్లో ఉంది. ప్రస్తుతం 230 కోట్ల మంది క్రైస్తవులు(Christians) ఉన్నారు. అయితే కొంతకాలంగా క్రైస్తవ జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. మత మార్పిడులు, జనన రేట్లు తక్కువగా ఉండడంతో 2010 నుంచి 2020 వరకు 1.8 శాతం తగ్గింది. అలాగే ప్రపంచంలో ఏ మతాన్ని అనుసరించని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో ఏ మతం అనుసరించని వారు మూడో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో క్రైస్తవం, రెండో స్థానంలో ఇస్లాం ఉన్నాయి.