అక్షరటుడే, ఇందూరు : Randomization | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో గురువారం కార్యక్రమం జరిగింది.
Randomization | జిల్లా కలెక్టరేట్లో..
జిల్లా కలెక్టరేట్లో (District Collectorate) వీసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation), బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit), నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ డిప్యూటీ సీఈవో సాయన్న, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.