ePaper
More
    Homeబిజినెస్​Stock Markets | కొనసాగిన ర్యాలీ.. ఆరో రోజూ లాభాలే..

    Stock Markets | కొనసాగిన ర్యాలీ.. ఆరో రోజూ లాభాలే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Markets | దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic stock markets)లో ర్యాలీ కొనసాగింది. వరుసగా ఆరో రోజూ మన ప్రధాన సూచీలు లాభాలలోనే ముగిశాయి.

    మంగళవారం ఉదయం లాభంతో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌(Benchmark indices)లు మొదట్లో నష్టాల్లోకి జారుకున్నా వెంటనే కోలుకున్నాయి. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరి గంటలో సూచీలు పతనమైనా లాభాల్లోనే ముగిశాయి. ఉదయం 320 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex) ఇంట్రాడేలో గరిష్టంగా 416 పాయింట్లు లాభపడింది. చివరికి 187 పాయింట్ల లాభంతో 79,595 వద్ద ముగిసింది. నిఫ్టీ(Nifty) 60 పాయింట్ల లాభంతో ప్రారంభమె ఇంట్రాడేలో గరిష్టంగా 117 పాయింట్లు పెరిగింది. ట్రేడింగ్‌(Trading) ముగిసే సమయానికి 41 పాయింట్ల లాభంతో 24,167 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో లిక్విడిటీని పెంచడానికి ఆర్‌బీఐ reserve bank of india తీసుకుంటున్న చర్యలు బ్యాంకింగ్‌ రంగానికి ఊతమిచ్చాయి. బ్యాంకులు Q4లో మంచి ఫలితాలను సాధిస్తుండడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. దీంతో బ్యాంక్‌ నిఫ్టీ(Bank nifty) వరుసగా కొత్త రికార్డులను నెలకొల్పుతూ పోతోంది. ఇది ఇతర సూచీలలోనూ ర్యాలీకి కారణమవుతోంది.

    Stock Markets | రాణించిన ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌..

    లార్జ్‌క్యాప్‌(Large cap) కన్నా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువగా లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ మెరుగైన ప్రదర్శన ఇచ్చాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ(FMCG) ఇండెక్స్‌ 1.89 శాతం మేర పెరిగింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌(PSU Banks), ఫైనాన్స్‌, రియాలిటీ, ఆటో, ఫార్మా స్టాక్స్‌ రాణించాయి. ఐటీ, ఇన్‌ఫ్రా, ఎనర్జీ రంగాల స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

    బీఎస్‌ఈ(BSE)లో ట్రేడ్‌ అయిన కంపెనీలలో 2,477 లాభాలతో, 1,504 నష్టాలతో ముగియగా.. 149 కంపెనీలు ఫ్లాట్‌గా కదలాడాయి.

    85 స్టాక్స్‌ 52 వారాల గరిష్టాల వద్ద, 29 స్టాక్స్‌ 52 వారాల కనిష్టాల వద్ద కొనసాగాయి. 4 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Top Gainers..
    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 15 స్టాక్స్‌ లాభాలతో 15 స్టాక్స్‌ నష్టాలతో ముగిశాయి. ఐటీసీ, హెచ్యూఎల్‌(HUL) రెండు శాతానికిపైగా లాభపడగా.. కొటక్‌ బ్యాంక్‌ kotak bank stuocks, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం, ఎటర్నల్‌ ఒక శాతానికిపైగా పెరిగాయి.

    Top Losers..
    ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌(IndusInd bank) 4.88 శాతం నష్టపోయింది. పవర్‌గ్రిడ్‌ రెండు శాతానికిపైగా క్షీణించగా, ఇన్ఫోసిస్‌(Infosys Stock), ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ Bajaj Finserv, ఎన్టీపీసీ NTPC ఒక శాతానికిపైగా పడిపోయాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...