అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shyam Dhani Industries IPO | శ్యాం ధని ఇండస్ట్రీస్ లిమిటెడ్(Shyam Dhani Industries Ltd) అనేది బ్రాండెడ్ మసాలాలు, ఫుడ్ ప్రొడక్ట్స్ రంగానికి చెందిన కంపెనీ. 1995లో దీనిని ఏర్పాటు చేశారు.
రాజస్థాన్‌లోని జైపూర్, జటావాలిలలో మిరియాలు, నల్ల ఉప్పు, రాక్ సాల్ట్(Rock salt), బియ్యం, మిరపకాయల పొడి తదితరాలను ప్రాసెస్ చేసి ‘‘శ్యాం’’ బ్రాండ్ పేరుతో మార్కెట్ చేస్తోంది. జనరల్ ట్రేడ్, మోడర్న్ ట్రేడ్, క్విక్ కామర్స్, HoReCa ఎక్స్పోర్ట్లలో పనిచేస్తోంది. ఈ కంపెనీ ఫ్రెష్ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 38.49 కోట్లు సమీకరించనుంది. ఐపీవో(IPO) ద్వారా వచ్చిన నిధులను రుణాల తగ్గింపునకు, వర్కింగ్ క్యాపిటల్ కోసం, సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్స్ కొనుగోలుకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Shyam Dhani Industries IPO | ముఖ్యమైన తేదీలు..
- ఐపీవో సబ్స్క్రిప్షన్ ప్రారంభ తేదీ : డిసెంబర్ 22.
- బిడ్డింగ్ ముగింపు తేదీ : డిసెంబర్ 24.
- అలాట్మెంట్ తేదీ : డిసెంబర్ 26న రాత్రి.
- లిస్టింగ్ తేదీ : డిసెంబర్ 30(ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫాంలో కంపెనీ షేర్లు లిస్టవుతాయి.)
Shyam Dhani Industries IPO | ధరల శ్రేణి..
కంపెనీ ధరల శ్రేణి(Price band)ని రూ. 65 నుంచి రూ. 70 గా నిర్ణయించింది. లాట్ సైజు: 2,000 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్ల కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 2.80 లక్షలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Shyam Dhani Industries IPO | కంపెనీ ఆర్థిక పరిస్థితి..
కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 107.64 కోట్ల రెవెన్యూ(Revenue) ద్వారా రూ. 6.30 కోట్ల ప్యాట్(PAT) జనరేట్ చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రూ. 124.75 కోట్లకు, ప్యాట్ రూ. 8.04 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ ఆస్తులు(Assets) రూ. 82.47 కోట్లనుంచి రూ. 88.79 కోట్లకు చేరాయి.
Shyam Dhani Industries IPO | కోటా, జీఎంపీ..
క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, హెచ్ఎన్ఐలకు 15 శాతం కోటా కేటాయించారు. ఒక్కో ఈక్విటీ షేరుకు జీఎంపీ(GMP) రూ. 36గా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయ్యేవారికి లిస్టింగ్ సమయంలో 50 శాతానికిపైగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.