అక్షరటుడే, వెబ్డెస్క్: Kalvakuntla Kavitha | ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా (Karimnagar district) మానకొండూర్లో ఆమె బుధవారం ధర్నా నిర్వహించారు.
మానకొండూరు పోలీస్ స్టేషన్ (Manakondur police station) సమీపంలో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉద్యమకారులకు కేటాయించాలని కవిత అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా సదరు భూమిలో తెలంగాణ ఉద్యమ కార్యకర్తలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలన్నారు. ఎవడు ఇచ్చేది ఏందిరా.. మా భూమి మాదిరా అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఉద్యమకారులకు 250 గజాల చొప్పున స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో పోరాటాలు చేస్తామన్నారు.
Kalvakuntla Kavitha | ఉద్యమద్రోహులకు పదవులు
తెలంగాణ కోసం 1200 మంది చనిపోతే 540 మంది కుటుంబాలకు మాత్రమే సాయం అందిందన్నారు. కాంగ్రెస్ నాయకులు దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. నాడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారు నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను పట్టించుకోని ప్రభుత్వం ఉద్యమ ద్రోహులకు పదవులు ఇస్తుందన్నారు. ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు.