Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Congress | చేతులెత్తి డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చెల్లదు: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Kamareddy Congress | చేతులెత్తి డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చెల్లదు: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

చేతులెత్తి డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను నిలువరించాలని టీపీసీసీ జనరల్​ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి కోరారు. ఏఐసీసీ పరిశీలకుడు రాజ్​పాల్​కు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress | చేతులెత్తి డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను నిలువరించాలని టీపీసీసీ జనరల్​ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఏఐసీసీ (AICC) పరిశీలకుడు రాజ్​పాల్ కరోలాను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి నియోజకవర్గం(Kamareddy Constituency) యొక్క డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఏఐసీసీ, పీసీసీ(TPCC) తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా, నిరంకుశంగా, ఏకపక్షంగా జరిగిందన్నారు.

ఈ ప్రక్రియను పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలని ఆయన కోరారు. అలాగే ఈ ప్రక్రియను పునఃపరిశీలించాలని కోరారు. చేతులు ఎత్తి ఎన్నిక ఎన్నికల ప్రక్రియ పార్టీకి చెల్లదని లేఖలో పేర్కొన్నారు.