Midday meal
Midday meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

అక్షరటుడే, బాన్సువాడ: Midday meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ (AITUC) జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దుబాస్‌ రాములు, ఎండీఎం (MDM) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం (Banswada Sub Collector’s Office) వద్ద మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు.

అంతకుముందు సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయికి (Sub-Collector Kiranmayi) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలలుగా బిల్లులు రావడం లేదని, దీంతో అప్పు చేసి విద్యార్థులకు భోజనం అందిస్తున్నారన్నారు.

జిల్లాకు రావాల్సిన రూ.6 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, గుడ్లు, వంట గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. అలాగే, కార్మికులకు పీఎఫ్(PF), ఈఎస్‌ఐ (ESI), ఇన్సూరెన్స్‌ వసతి కల్పించాలని, యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేలు వేతనం అందించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సోఫియా, భాషా మియా, బాలరాజు, సంగీత, సరళ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.