Homeజిల్లాలునిజామాబాద్​TNGO'S Nizamabad | అంగన్​వాడీల సమస్యలను పరిష్కరించాలి

TNGO’S Nizamabad | అంగన్​వాడీల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: TNGO’S Nizamabad |అంగన్​వాడీ (Anganwadi) ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవోస్ (TNGO’S Nizamabad)​ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, శేఖర్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్​వాడీల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. వినతిపత్రం అందించిన వారిలో టీఎన్జీవోస్ ఆర్మూర్ శాఖ అధ్యక్షుడు శశికాంత్, అంగన్​వాడీ యూనియన్ అధ్యక్షురాలు అనురాధ, లక్ష్మి తదితరులు ఉన్నారు.