అక్షరటుడే, భీమ్‌గల్ : MLA Prashanth Reddy | భీమ్‌గల్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) భాగంగా జీరో అవర్‌లో ఆయన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
MLA Prashanth Reddy | ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్..
బాల్కొండ నియోజకవర్గంలోని (Balkonda Constituency) భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రశాంత్‌రెడ్డి కోరారు. గత ప్రభుత్వ హయాంలో భీమ్‌గల్ మున్సిపాలిటీకి (Bheemgal Municipality) 100 పడకల ఆస్పత్రి మంజూరైందన్నారు. ఇప్పటికే 80శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
MLA Prashanth Reddy | ఆస్పత్రి సిబ్బంది అలాట్మెంట్ అయినప్పటికీ..
ఆస్పత్రి కోసం స్టాఫ్ అలాట్మెంట్ కూడా జరిగిందని, అయితే భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రూ. 35 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్టులో దాదాపు రూ. 30 కోట్ల పనులు పూర్తయ్యాయని.. కానీ రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేసి, మిగిలిన రూ. 5 కోట్లు కేటాయించి ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను (Damodara Rajanarasimha) కోరారు.
MLA Prashanth Reddy | మార్కెట్ పనులపైనా నిర్లక్ష్యం తగదు..
భీమ్‌గల్ మండల కేంద్రంలో ఉన్న రోడ్లపైనే కూరగాయల మార్కెట్ (Vegetable Market) నిర్వహించడం వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దీని పరిష్కారం కోసం గతంలో రూ. 3.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయని, అయితే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారని సభ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించి మార్కెట్‌ను త్వరగా పూర్తి చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.