Homeబిజినెస్​IPO | సందడి చేయనున్న ప్రైమరీ మార్కెట్‌.. మెయిన్‌ బోర్డ్‌నుంచి 3.. ఎస్‌ఎంఈ విభాగంనుంచి 11...

IPO | సందడి చేయనున్న ప్రైమరీ మార్కెట్‌.. మెయిన్‌ బోర్డ్‌నుంచి 3.. ఎస్‌ఎంఈ విభాగంనుంచి 11 ఐపీవోలు

స్టాక్‌ మార్కెట్‌ ఐపీవోలతో కళకళలాడనుంది. ఈనెల మొదటి వారంలో మెయిన్‌ బోర్డ్‌నుంచి మూడు కంపెనీలు, ఎస్‌ఎంఈ విభాగంనుంచి 11 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి. వీటితో పాటు ఆరు కంపెనీలు మార్కెట్‌ అరంగేట్రం చేయనున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: IPO | డిసెంబర్‌ నెలలోనూ ప్రైమరీ మార్కెట్‌ (Primary Market)లో సందడి కొనసాగనుంది. మొదటివారంలో మీషో, అక్యూస్‌, విద్య వైర్స్‌ వంటి మెయిన్‌బోర్డ్‌ కంపెనీల పబ్లిక్‌ ఇష్యూ ప్రారంభం కానుంది.

అలాగే 11 ఎస్‌ఎంఈ(SME) ఐపీవోల సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఈ వారంలోనే మొదలవనుంది. ఆరు ఎస్‌ఎంఈ కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కానున్నాయి. మెయిన్‌ బోర్డ్‌ కంపెనీల జీఎంపీ ఆకర్షణీయంగా ఉండడంతో భారీగా సబ్‌స్క్రైబ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. .

మీషో..

మీషో ఐపీవో (Meesho IPO) ద్వారా రూ. 5,421 కోట్లు సమీకరించనుంది. ఇందులో ఫ్రెష్‌ ఇష్యూతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS) కూడా ఉంది. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ. 111గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 135 షేర్లున్నాయి. ఐపీవో బిడ్డింగ్‌ ఈనెల 3న ప్రారంభమై 5న ముగియనుంది. ఈ కంపెనీ షేర్లు ఈనెల 10న స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి. ఈ కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్‌లో రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతోంది. సోమవారం ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 42 ప్రీమియం లభిస్తోంది. అంటే లిస్టింగ్‌ సమయంలో 38 శాతం వరకు లాభాలు(Listing gains) వచ్చే అవకాశాలున్నాయి.

అక్యూస్‌..

విమానాలు, కార్లు, ఇతర వాహనాలకు విడిభాగాలు తయారు చేసే అక్యూస్‌ కంపెనీ ఐపీవో (Aequs Company IPO) కు వస్తోంది. పబ్లిక్‌ ఇష్యూద్వారా రూ. 922 కోట్లు సేకరించనుంది. కంపెనీ ఒక్కో షేరు ధరను గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ. 124 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 120 షేర్లున్నాయి. 3న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమవుతుంది. 5 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు కూడా డిసెంబర్‌ 10నే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి. ఒక్కో ఈక్విటీ షేరుకు గ్రే మార్కెట్‌ ప్రీమియం రూ. 43గా ఉంది. అంటే ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ సమయంలో 35 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

విద్య వైర్స్‌..

వైర్లు, కేబుల్స్‌ తయారు చేసే విద్య వైర్స్‌ (Vidya Wires) పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 3న ప్రారంభం కానుంది. ఇది మార్కెట్‌నుంచి రూ. 300 కోట్లు సమీకరించనుంది. ఒక్కో ఈక్విటీ షేరు ధర గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ. 52గా ఉంది. లాట్‌లో 288 షేర్లున్నాయి. పబ్లిక్‌ ఇష్యూ బిడ్డింగ్‌ 3న మొదలై 5న ముగుస్తుంది. ఈ కంపెనీ కూడా డిసెంబర్‌ 10న లిస్ట్‌ కానుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) రూ. 10 ఉంది. అంటే లిస్టింగ్‌ సమయంలో 19 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ఎస్‌ఎంఈ ఐపీవోలు..

  • డిసెంబర్‌ 1న ఆస్ట్రాన్‌ మల్టీగ్రెయిన్‌ (Astron Multigrain), ఇన్విక్టా డయాగ్నస్టిక్‌, స్పెబ్‌ అధెసివ్స్‌, క్లియర్‌ సెక్యూర్డ్‌ సర్వీసెస్‌, రావెల్‌ కేర్‌(Ravelcare) ఎస్‌ఎంఈ ఐపీవోల సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం అవుతుంది.
  • డిసెంబర్‌ 2న హెల్లోజీ హాలిడేస్‌, నియోకెమ్‌ బయో సొల్యూషన్స్‌ ఐపీవోలు ప్రారంభం అవుతాయి.
  • డిసెంబర్‌ 3న శ్రీ కన్హ స్టెయిన్‌లెస్‌ ఎస్‌ఎంఈ ఐపీవో బిడ్డింగ్‌ ప్రారంభమవుతుంది.
  • డిసెంబర్‌ 4న లగ్జరీ టైమ్‌(Luxury Time), వెస్టర్న్‌ ఓవర్‌సీస్‌ స్టడీ అబ్రాడ్‌ ఎస్‌ఎంఈ బిడ్డింగ్‌ మొదలవుతుంది.
  • డిసెంబర్‌ 5న మెథడ్‌హబ్‌ సాఫ్ట్‌వేర్‌ ఎస్‌ఎంఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమవుతుంది.

లిస్టయ్యే కంపెనీలు..

డిసెంబర్‌ 2న ఎస్‌ఎస్‌ఎండీ అగ్రోటెక్‌ ఇండియా బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలో లిస్టవనుంది. డిసెంబర్‌ 3న మదర్‌ న్యూట్రి ఫుడ్స్‌, కేకే సిల్క్‌ మిల్స్‌, డిసెంబర్‌ 5న ఎక్సాటో టెక్నాలజీస్‌ (Exato Technologies), లాజిసీల్‌ సొల్యూషన్స్‌, పర్పుల్‌ వేవ్‌ ఇన్ఫోకామ్‌ స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం చేస్తాయి.

Must Read
Related News