ePaper
More
    Homeఅంతర్జాతీయంKhamenei | మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.. ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌ ఖ‌మేనీ హెచ్చ‌రిక‌

    Khamenei | మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు.. ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌ ఖ‌మేనీ హెచ్చ‌రిక‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Khamenei | త‌మ‌పై దాడికి దిగి ఇజ్రాయెల్(Israel) అతి పెద్ద తప్పు చేసింద‌ని ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ పేర్కొన్నారు. ఇందుకు ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఇరాన్ అణ్వ‌స్త్రాలు(Iran Nuclear Weapons) త‌యారు చేస్తుంద‌ని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆ దేశంపై యుద్ధానికి దిగిన సంగ‌తి తెలిసిందే.

    ఈ నేప‌థ్యంలోనే ఇరాన్‌లోని మూడు కీల‌క అణు కేంద్రాలపై అమెరికా భారీ బంక‌ర్ బ‌స్ట‌ర్ బాంబుల‌తో దాడి చేసింది. దీనిపై స్పందించిన ఖమేనీ(Khamenei).. ఇజ్రాయెల్‌కు త‌గిన శిక్ష విధిస్తామని ప్ర‌క‌టించారు. టెల్ అవీవ్‌(Tel Aviv)పై దాడులను తీవ్రతరం చేస్తామని ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే, ఆయ‌న ఎక్క‌డా అమెరికా దాడుల గురించి ప్ర‌స్తావించలేదు. “శిక్ష కొనసాగుతుంది. జియోనిస్ట్ శత్రువు ఘోరమైన తప్పు చేశాడు. పెద్ద నేరం చేశాడు. అందుకు వారిని శిక్షించాల్సిందే. దానిని(ఇజ్రాయెల్‌) ప్రస్తుతం శిక్షిస్తున్నారు” అని ఖ‌మేనీ పేర్కొన్నారు. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్'(Operation Midnight Hammer) నిర్వహించిన తర్వాత ఖమేనీ నుంచి ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. త‌మ‌పై దాడి చేయడం ద్వారా అమెరికా అంతర్జాతీయ చట్టాల్ని, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించిందని ఇరాన్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. వాషింగ్టన్ దాడి తర్వాత తనను తాను రక్షించుకోవడానికి “అన్ని అవ‌కాశాలు ఉన్నాయని” పేర్కొంది. మ‌రోవైపు, ఇరాన్‌పై దాడిని ర‌ష్యా, చైనా, పాకిస్తాన్‌ లాంటి దేశాలు ఖండించాయి.

    READ ALSO  fake embassy | గుర్తింపు లేని దేశాలకు రాయబారి.. ప్రధాని, ప్రముఖులతో ఫొటోలు.. భారీ మోసానికి తెర లేపిన ఘనుడు..

    Khamenei | స‌మ‌యాన్ని బ‌ట్టి నిర్ణ‌యం

    మ‌రోవైపు, అమెరికా(America)పై ప్ర‌తీకార దాడుల విష‌యంలో ఇరాన్ ఆచితూచి స్పందించింది. దాడులపై స‌మ‌యాన్నినిర్ణ‌యం తీసుకుంటామ‌ని పేర్కొంది. తమ‌ దేశంలోని అణు కేంద్రాలపై వైమానిక దాడుల ద్వారా అమెరికా దౌత్య మార్గాల‌ను పూర్తిగా నాశ‌నం చేసింద‌ని పేర్కొంది. త‌మ అణు కేంద్రాలపై దాడుల‌కు ప్ర‌తిస్పంద‌న స‌మ‌యం, స్వ‌భావం, స్థాయిని సైన్యం నిర్ణ‌యింస్తుంద‌ని తెలిపింది. ఈ మేర‌కు ఐక్య‌రాజ్య స‌మితిలో ఇరాన్ రాయ‌బారి అమీర్ సయీద్ ఇరావానీ(Iranian Ambassador Amir Saeed Iravani), మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. “ఈ గందరగోళంలో పడకుండా ఉండమని ఇరాన్ యుద్ధోన్మాద అమెరికా పాలనను పదేపదే హెచ్చరించింది. అయిన‌ప్ప‌టికీ వారు దాడుల‌కు దిగి దౌత్య మార్గాల‌ను మూసివేశార‌ని” అన్నారు. “ఈ స్పష్టమైన అమెరికా, ఇజ్రాయెల్‌ దురాక్రమణ నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఇరాన్ అంతర్జాతీయ చట్టం ప్రకారం పూర్తి, చట్టబద్ధమైన హక్కును కలిగి ఉన్నప్పటికీ, ఇరాన్ ప్రతిస్పందన సమయం, స్వభావం మరియు స్థాయిని సాయుధ దళాలు నిర్ణయిస్తాయి” అని ఇరావానీ తెలిపారు.

    READ ALSO  Israel | గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...