Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad MP | జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బీజేపీదే.. కాంగ్రెస్​కు ఒక్క సీటు రాదు

Nizamabad MP | జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బీజేపీదే.. కాంగ్రెస్​కు ఒక్క సీటు రాదు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad MP | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బీజేపీదేనని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం సేవా పక్వాడ కార్యశాల నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్వే (Congress survey) ప్రకారం.. వారికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. అన్ని పార్టీల నాయకులు బీజేపీ నుంచి టికెట్ అడిగే పరిస్థితి నెలకొందన్నారు. ఈసారి అన్ని ఎంపీపీ సీట్లు (MPP seats) కూడా కాషాయమయమయ్యేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Nizamabad MP | బీజేపీపై నమ్మకం పెరిగింది..

బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టం అన్నారు. అలాగే సేవా పక్వాడ ప్రతి ఏడాది నిర్వహిస్తామని, ఈ ఏడాది కూడా జిల్లా నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (district president Dinesh Kulachari) మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ రెండు వరకు 15 రోజులపాటు సేవా పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బోధన్ నాయకులు ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News