అక్షరటుడే, ఇందల్వాయి: ACP raja Venkat reddy | ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌ను (Indalwai Police Station) ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్‌ను పరిశీలించారు.
పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ACP raja Venkat reddy | స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా..
స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న దృష్ట్యా పోలీసులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏసీపీ సూచించారు. ఆన్లైన్ గేమ్స్ (Online Games), ఆన్లైన్ బెట్టింగ్‌పై (Online Betting) నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఇసుక, జూదం, పీడీఎస్ రైస్ (PDS Rice), అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డులు సీసీటీఎన్ఎస్ డాటా అప్డేట్ ఉన్నందున అధికారులను సిబ్బందిని అభినందించారు. (వీపీవో) విలేజ్ పోలీస్ ఆఫీసర్‌కు కేటాయించిన గ్రామాలు, వార్డులను తరచుగా సందర్శిస్తూ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపర్చుకోవాలన్నారు.
ACP raja Venkat reddy | వాకింగ్, రన్నింగ్ చేయాలి..
సిబ్బంది విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని, సమయం దొరికినప్పుడల్లా వాకింగ్, రన్నింగ్ యోగా చేస్తూ ఉండాలని పోలీసు సిబ్బందికి ఏసీపీ సలహా ఇచ్చారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల పట్ల సానుభూతితో వ్యవహరించాలని.. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో టోల్ ప్లాజా ఉన్నందున రోజూ విస్తృతంగా తనిఖీలు చేయాలని ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్‌స్టేషన్‌లో అధికారులతో మాట్లాడుతున్న ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి