అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Police Prajavani | పోలీస్ ప్రజావాణిలో 21 ఫిర్యాదులు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
సీపీ మాట్లాడుతూ.. ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా వారి పరిష్కారం కోసం ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు సూచనలు చేశామన్నారు. ప్రజలు నిర్భయంగా.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సీపీ కార్యాలయంలోని (CP Office) ప్రజావాణిలో తమ సమస్యల విషయమై ఫిర్యాదు చేయవచ్చని సీపీ తెలియజేశారు.
Police Prajavani | శాంతి భద్రతలను పరిరక్షిస్తూ..
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు పరిరక్షిస్తూ ముందుకు సాగుతున్నామని సీపీ పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.