Homeజిల్లాలునిజామాబాద్​Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు (KTR) నోటీసులివ్వడం కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యకు పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి (BRS District President Jeevan Reddy) అన్నారు. సోమవారం ఒక ప్రకటనలో కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డారు.

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్‌ ప్రభుత్వంపై ప్రశ్నించినందుకే వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేటీఆర్‌ ఫార్ములా ఈకార్‌ రేసింగ్‌తో (Formula E car Racing) హైదరాబాద్‌ (Hyderabad) బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చారన్నారు. రేవంత్‌ మాదిరి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి పట్టుబడిన నేర చరిత్ర కేటీఆర్‌కు లేదన్నారు. కాంగ్రెస్‌ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేదాకా పోరాటం చేస్తామన్నారు.