అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | నగరపాలక సంస్థ పనితీరు మెరుగుపడాలని, నగర రూపురేఖల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా పనిచేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో (Nizamabad Municipal Corporation) శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
పచ్చదనం పెంపొందించడం, పారిశుధ్య నిర్వహణ, బల్దియా ఆస్తుల పరిరక్షణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఒక్కో డివిజన్ వారీగా సాధించిన ప్రగతి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో వార్డ్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అవకాశం ఉన్నచోట డ్రెయినేజీలను శుభ్రపర్చేందుకు జేసీబీలను వినియోగించాలని సూచించారు.
శానిటేషన్ పనులకు (Sanitation) ఉపయోగపడే గ్రాస్కట్టర్, డ్రిల్ మిషన్స్ కొనుగోలు చేయాలని తెలిపారు. చెడిపోయిన యంత్రాలు, వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వన మహోత్సవంలో (vana Mahotsavam) భాగంగా నాటిన మొక్కల నిర్వహణ, సంరక్షణ పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలన్నారు. కార్పొరేషన్ స్థలాలు కబ్జాకు గురైతే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
Collector Nizamabad | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరగాలి..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు కూడా జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

