అక్షరటుడే, ఎల్లారెడ్డి : Lok Adalat | కక్షిదారులకు రాజీమార్గమే రాజమార్గమని ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ(Judge Sushma) పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 480 కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
రాజీపడటానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చని ఆమె సూచించారు. క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన అవకాశం ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనసవర గొడవలు, పట్టింపులకు పోయి జీవితాలను ఇబ్బందుల పాలు చేసుకోవద్దని సూచించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ అత్యంత సులభమైన మార్గమన్నారు.
ఈ సందర్భంగా లోక్అదాలత్(Lok Adalat)లో పరిష్కారమైన కేసుల వివరాలను వెల్లడించారు. 3 సివిల్ తగాదాలు, 47 క్రిమినల్ కేసులు, 12 అబ్కారీ కేసులు (రూ.60,000), 14 క్రిమినల్ నేరం ఒప్పుకున్నవి (రూ.53,500), 1 చెక్ బౌన్స్ కేసు, 2 భత్యం కేసులు, 341 పీటీ కేసులు(రూ.4,09,630), 18 బ్యాంకు తగాదాలు (రూ.8,46,000), 3 సైబర్ నేరాలు (రూ.29,015) పరిష్కారమయ్యాయని వివరించారు.