అక్షరటుడే, వెబ్డెస్క్: Kamareddy MLA | కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (MLA Katipalli Venkataramana Reddy) పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Minister Kishan Reddy), ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. స్థానిక ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పార్టీ నేతల తీరుపై కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Kamareddy MLA | సమన్వయ లోపం..
వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ లోపం ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సమావేశాలకు రావడం, వెళ్లడమే తమ పనా అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదని అడిగినట్లు తెలుస్తోంది.