అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka Deputy CM | కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగుతుందన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) గురువారం మరోమారు స్పందించారు. పార్టీయే తనకు ముఖ్యమని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించారు. 2028లో కర్ణాటకలో (Karnataka) మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే పని చేస్తున్నట్లు వార్తాసంస్థ ఏఎన్ఐతో స్పష్టం చేశారు. “నేను నా పార్టీతో కలిసి నడవాలి. నాకు పార్టీ ముఖ్యం. నా హైకమాండ్ నిర్ణయం (high command decision) ముఖ్యం. మాకు 2028 (రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు)లో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యం ఉంది. దానికోసం మేము పని చేస్తాం” అని తెలిపారు.
Karnataka Deputy CM | వేరే ఆప్షన్ లేదు కదా..?
రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు (ministers and MLAs) చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాలపై (Karnataka politics) ఆసక్తి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో బుధవారం మంత్రివర్గ సమావేశంపైనే అందరి దృష్టి నెలకొంది. అయితే, ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారంపై స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. హైకమాండ్ చెప్పింది చేయడం తప్ప తన దగ్గర ఇంకా ఏ ఆప్షన్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు (Chief Minister Siddaramaiah) తన మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. “నా దగ్గర ఏ ఆప్షన్ ఉంది? నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు…” అని పేర్కొన్నారు. 2028 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలను తాను పాటిస్తానని శివకుమార్ పేర్కొన్నారు.
Karnataka Deputy CM | విభేదాలు లేవన్న సిద్దు..
రాష్ట్ర ప్రభుత్వంలో చీలికలు వచ్చాయన్పన బీజేపీ (BJP) ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) తోసిపుచ్చారు. అవన్నీ అబద్ధాలేని పేర్కొన్నారు. తన సారథ్యంలోని ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని పునరుద్ఘాటించారు. “బీజేపీ చెప్పేది అబద్ధాలు మాత్రమే. వారు అబద్ధాలకు ప్రసిద్ధి చెందారు. వారికి నిజం ఎలా మాట్లాడాలో తెలియదు. వారు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, మేమందరం కలిసి ఉన్నాము” అని ఆయన చెప్పారు. బీజేపీ పగటి కలలు కంటోందని, కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని తెలిపారు.