అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు భయపడి తనను అధికారులు బంకర్లో దాక్కొమన్నారని పాక్ అధ్యక్షుడు (Pakistan President) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకు తాను ఒప్పుకేలేదన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పీవోకే, పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ వైమానిక దళం (Indian Air Force) ధ్వంసం చేసింది. అనంతరం పాక్ డ్రోన్లు, మిసైళ్లతో భారత్‌పైకి దాడికి యత్నించగా.. భారత గగనతల రక్షణ వ్యవస్థ (Indian air defense system) సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే పాక్ దాడులకు తెగబడటంతో భారత్ పాక్‌పై విరుచుకుపడింది. దీంతో ఆ దేశ అధినేతలు, ఆర్మీ చీఫ్ తదితరులు బంకర్లలో దాక్కుతున్నారు. తాజాగా దీనిపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ (Pakistan President Asif Ali Zardari) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలలో భారతదేశంతో జరిగిన నాలుగు రోజుల సంఘర్షణ సమయంలో తన సైనిక కార్యదర్శి తనను బంకర్‌కు వెళ్లమని సలహా ఇచ్చారని అంగీకరించారు. అయితే తాను ఆ సలహాను తిరస్కరించానని ఒక బహిరంగ సభలో ఆయన చెప్పారు.
Operation Sindoor | యుద్ధభూమిలో చనిపోతారు
ఏప్రిల్ 26న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. దీనికి ప్రతికారంగా భారత్ మే 7న ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. దాడులు ప్రారంభమైన తర్వాత తన సైనిక కార్యదర్శి తనను బంకర్లో ఆశ్రయం తీసుకోమని కోరారని జర్దారీ వెల్లడించారు. కానీ తాను వీరమరణం సంభవించాల్సి వస్తే, అది ఇక్కడే సంభవిస్తుంది. నాయకులు బంకర్లలో చనిపోరు. వారు యుద్ధభూమిలో చనిపోతానని చెప్పినట్లు జర్దారీ తెలిపారు. ఈ యుద్ధం గురించి తనకు నాలుగు రోజుల ముందే తెలుసని కూడా పేర్కొన్నారు. మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాగా.. నాలుగు రోజుల పాటు ఇరుదేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అనంతరం పాక్ కాల్పుల విరమణకు ప్రతిపాదించడంతో భారత్ ఒప్పుకుంది. దీంతో మే 10న ఉద్రిక్తలు ముగిసిపోయాయి.
పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఆపరేషన్ సిందూర్ సమయంలో తమకు నష్టం వాటిల్లినట్లు ఒప్పుకున్నారు. భారత దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు అంగీకరించారు. కాగా మొన్నటి వరకు తమకు ఎలాంటి నష్టం లేదని చెప్పిన పాక్ నేతలు తాజాగా నిజాలు ఒప్పుకుంటున్నారు.