అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cool Drinks | రోడ్డు ప్రమాదాలు road accidents జరిగి వాహనాలు బోల్తా పడితే అయ్యో పాపం అంటాం.. కానీ వీరు మాత్రం ఇదే మంచి అవకాశం అనుకున్నారు. కూల్‌డ్రింక్ cool drink లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా పడగా.. అటుగా వెళ్తున్న వారు కూల్‌డ్రింక్ బాటిళ్లను ఎంచక్కా తీసుకు వెళ్లారు. ఈ ఘటన విజయవాడ – మచిలీపట్నం హైవే Vijayawada – Machilipatnam Highway పై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
కూల్ డ్రింక్ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ టైర్ పేలడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వ్యాన్ బోల్తా పడటంతో కూల్ డ్రింక్ కేసులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు మెళ్లిగా ఆ కేసులను తీసుకుపోయారు. ప్రమాదం జరిగి వారు బాధపడుతుంటే.. కూల్‌డ్రింక్ కేసులను ఎత్తుకెళ్లడం ఏంటని పలువురు నెటిజెన్లు మండిపడుతున్నారు.