Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నగర శివారు ప్రాంతాలు అస్తవ్యస్తం.. అధికార యంత్రాంగం అప్రమత్తం

Nizamabad City | నగర శివారు ప్రాంతాలు అస్తవ్యస్తం.. అధికార యంత్రాంగం అప్రమత్తం

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను  అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

నగర శివారులోని చంద్రశేఖర్ కాలనీ (Chandrasekhar Colony), న్యాల్​కల్​ రోడ్డు (Nyalkal Road), అర్సపల్లి (Arsapalli), ఆటో నగర్, తదితర కాలనీలో వర్షం నీరు చేరింది. అలాగే పూలాంగ్​ వాగులో నీటి ప్రవాహం పెరగడంతో విశ్వశాంతి పాఠశాల నుంచి వినాయక్ నగర్​కు వెళ్లే దారిలో వంతెన పూర్తిగా మునిగింది.

Nizamabad City | కోర్టు చౌరస్తా ఏరియాలో..

కోర్టు చౌరస్తా నుంచి నటరాజ్ థియేటర్, ఎల్లమ్మ గుట్ట ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్​కు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు.

రైల్వేస్టేషన్​ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన నీరు

Nizamabad City

నగరంలోని విశ్వశాంతి కళాశాల నుంచి వినాయక్​నగర్​కు వెళ్లే వంతెన పూర్తిగా నీటమునిగిన దృశ్యం

నగరంలోని రేడియోస్టేషన్​ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన నీళ్లు