అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అగ్రవర్ణాల పెత్తనానికి చెక్ పెట్టే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyaadhikari Party) జిల్లా అధ్యక్షుడు తాహెర్ అన్నారు. పట్టణంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ రిజర్వేషన్ల (BC reservations) అంశంపై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందన్నారు.
రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి పూర్తిగా అన్యాయమని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గత ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తానని ఇచ్చిన భారీ హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీసీలను ఎప్పటికప్పుడూ మోసం చేస్తూ వస్తోందన్నారు.
Kamareddy | బీసీల అణిచివేత..
అగ్రవర్ణ కులాల చేతుల్లో బీసీ వర్గాలు (BC communities) దశాబ్దాలుగా అణిచివేతకు గురయ్యామని, ఇప్పటికైనా బీసీ వర్గాలంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో బీసీలకు పునరుజ్జీవన పోరాటం ప్రారంభమైందని, ఈ పోరాటాన్ని ప్రతి గ్రామంలో, ప్రతివాడలో విస్తరించాలని సూచించారు. ఈ సమావేశంలో రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్క సంతోషి, కామారెడ్డి మండల అధ్యక్షుడు సిద్ధరాములు, రాజంపేట మండల అధ్యక్షుడు అనిల్ పటేల్, బీబీపేట మండల అధ్యక్షుడు కాషాగౌడ్, భిక్కనూరు మండల అధ్యక్షుడు చంద్రకిరణ్ పాల్గొన్నారు.