- Advertisement -
Homeఆంధప్రదేశ్Amaravati | రాజధాని మునిగిపోయిందని పోస్ట్​ చేసిన అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

Amaravati | రాజధాని మునిగిపోయిందని పోస్ట్​ చేసిన అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amaravati | ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియా (Social Media)ను వినియోగిస్తున్నారు. అయితే సోషల్​ మీడియాలో పోస్టులు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిక్కులు తప్పవు.

ప్రభుత్వ ఉద్యోగులు సోషల్​ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దు. అలా పెడితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే కొందరు అధికారులు మాత్రం అప్పుడప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టి చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ ప్రభుత్వం ఒక అధికారిపై వేటు వేసింది.

- Advertisement -

Amaravati | ఫేస్​బుక్​లో ఫొటోలు పెట్టడంతో..

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి (Tirupati) జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుభాష్‌ రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ ఫేస్​బుక్​లో ఫొటోలు పెట్టారు. కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. వాణిజ్య పన్నులశాఖ ప్రాంతీయ ఆడిట్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సుభాష్‌ చంద్రబోస్‌ రాజధాని అమరావతిపై ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్టులు పెట్టారు.దీంతో సదరు అధికారి పోస్ట్​తో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాజధానిలో ప్రభుత్వం మూడు రిజర్వాయర్లు నిర్మించనుందంటూ వచ్చిన వార్తను ఆయన ట్యాగ్​ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం మూడు రిజర్వాయర్లెందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కట్టాలని పోస్ట్​ చేశారు. అంతేగాకుండా ఒకే ఒక్క వర్షం, అమరావతి జలమయం అంటూ పోస్ట్ ​చేశారు. దీంతో ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్​ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Amaravati | తెలంగాణలో..

గతంలో తెలంగాణలో సైతం ఓ అధికారి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై పెద్ద దుమారమే రేగింది. ఐఏఎస్​ అధికారి స్మితా సబర్వాల్​ (Smita Sabharwal) కంచె గచ్చిబౌలి భూముల వివాదం సమయంలో ఏఐ జనరేటెడ్​ పోస్ట్​ను షేర్​ చేశారు. దీంతో ప్రభుత్వం ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు సైతం స్మితా సభర్వాల్​కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News